దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతానికి సాగు నీరు అందించాలి
Uncategorizedజనగామ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
తహసీల్దార్ హుస్సేన్ గారికి వినతి పత్రం అందిస్తున్న నాయకులు
భూక్యా చందు నాయక్ తెలంగాణ రైతు సంఘం
జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్చరిక
జనగామ:దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతంలోని రిజర్వాయర్లు చెరువులు కుంటలు నింపి రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం ఇదే పద్ధతిని గనుక అవలంబిస్తే ప్రజా భవన్ ముట్టడిస్తారని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ హెచ్చరించారు.
తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు జనగామ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రంని తహసిల్దార్ హుస్సేన్ గారికి అందజేయడం జరిగింది. అనంతరం కార్యక్రమం తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, జిల్లా కమిటీ సభ్యులు బోడ రాములు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన
భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ………
జనగామ ప్రాంతం సముద్ర మట్టానికి 10వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండడం వలన గత కొన్ని ఏళ్ల క్రితం ఎడారి ప్రాంతంగా ఉండేదని ఈ ప్రాంతానికి దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదావరి జలాలను లిఫ్టింగ్ చేయాలని అనేక ఉద్యమాలు పోరాటాలు ఫలితంగా నిర్మించారని కానీ జనగామ ప్రాంతం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వలన దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి జనగామ జిల్లాలోని రైతాంగానే ఆదుకోవాలని చిత్తశుద్ధి లేదని గోదావరి జలాలను సముద్రంలో విడుదల చేస్తున్నారని అట్టి నీటినీ లిఫ్టింగ్ చేస్తే జనగామ ప్రాంతంలో సాగు నీరు అందించాలని అదేవిధంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా చెరువులు కుంటలో రిజర్వాయర్లలో నీరు లేని కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి జిల్లాలో ప్రభుత్వం వేసిన సాగు అంచనాకు భిన్నంగా కేవలం 31 శాతమే రైతులు సాగు చేశారని, దీనిలో కూడా పూర్తిగా బోరు బావులు ఎండిపోవడంతో నాటువేసిన పూర్తిగా ఎండిపోతున్నదని విత్తనాలు ఎండిపోయాయని మొక్కజొన్న ఎండిపోయిందని రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని కాబట్టి విత్తనాల కొనుగోలుతో పంటలు ఎండిపోయిన రైతులకు 50 వేల నష్టపరిహారం ఇవ్వాలనీ డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉర్సుల కుమార్,పయ్యావుల భిక్షపతి, సీనియర్ నాయకులు గురజాల లక్ష్మీనరసింహారెడ్డి,CITU నాయకులు తాండ్ర ఆనందం కాసర్ల నర్సిరెడ్డి రామచౌక్యం కర్రె బీరయ్య పేరబోయిన రామచంద్రు అసర్ల ఐలయ్య దండేబోయిన ఆంజనేయులు మన్నే శోభన్ బాబు కాసా జగన్ ఆత్కూరు ఎల్లయ్య
కర్రె శ్రీశైలం బండ సిద్ధమ్మ కాసర్ల నర్సిరెడ్డి వెంకటరెడ్డి అడ్వెకెట్ అభిషేక్ జోషి 30 రైతులు తదితరులు పాల్గొన్నారు.