ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని ఆర్థికంగా ఎదగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శుక్రవారం రేగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పక్కన ముదురుకోళ్ల సన్నీ కి చెందిన నూతన బేకరి శ్రేష్ఠ బెంగుళూరు బేకరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే గ్రూపు ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు ఉన్నారు.