ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలైన అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు-ఎమ్మెల్యే గండ్ర
Uncategorized

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు అన్నారు. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని దమ్మనపేట గ్రామంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అంతకుముందు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన శిలాఫలకాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదని అలాగే నూతన రేషన్ కార్డులు మంజూరు చేయలేదని అన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎం వెంకటేశ్వరరావు, స్థానిక కార్యదర్శి తండ్రి రాజ్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు ఇప్ప కాయల నరసయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు చుక్క జనార్ధన్ గౌడ్, జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుంటోజు కిష్టయ్య, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, ఆలయ చైర్మన్ ముల్కనూరు బిక్షపతి, ఎన్ ఎస్ ఆర్ అధిపతి నాయినేని సంపత్ రావు, మోడెం ఉమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ నడిపెల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ ఐలి శ్రీధర్ గౌడ్,మైస బిక్షపతి, కేశిరెడ్డి ప్రతాపరెడ్డి, నడిపెల్లి చక్రధర్ రావు, టౌన్ అధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల బిక్షపతి, గండి తిరుపతి గౌడ్,కోసారి నరేందర్, రేగొండ మండలం యూత్ అధ్యక్షులు కోయిల క్రాంతి, జంగిటి సుధాకర్, తోట ఈదయ్య, పున్నం ప్రవీణ్, మేకల శివ, పలువురు ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.