ఒంటిమామిడిపల్లి పిఎం శ్రీ పాఠశాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు
Uncategorized
ప్రీ-ప్రైమరీ విద్యా సమస్యలు,మరుగుదొడ్ల అసౌకర్యం,తాత్కాలిక పేరెంట్స్ కమిటీపై ఆగ్రహం
ఈ69 న్యూస్ ఐనవోలు,జూలై 23
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో ఉన్న పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) ను కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.మహమ్మద్ రఫీ మాట్లాడుతూ..ప్రీ-ప్రైమరీ తరగతులకు కేవలం ఒకే ప్రైవేట్ ఉపాధ్యాయురాలిని నియమించి,ఒకే తరగతిగదిలో 100 మందికి పైగా పిల్లలను కూర్చోబెట్టి విద్యా బోధన చేయడం వల్ల చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.ఇది పిల్లల శారీరక,మానసిక ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు.అలాగే,మరుగుదొడ్లలో పరిశుభ్రత లేకపోవడం,ఒకే చిన్న రేకుల షెడ్లో రెండు అంగన్వాడీ కేంద్రాలను నడపడం,ఇంకా ఖాళీగా ఉన్న రెండు పక్కా భవనాలను వాడకపోవడం పట్ల నిపుణుల వ్యాఖ్యానాల కంటే వాస్తవ పరిస్థితి బాగా దయనీయంగా ఉందని ఆయన అన్నారు.మండల కార్యదర్శి మహమ్మద్ రఫీ పేర్కొన్నట్టు,పాఠశాల ప్రారంభమైన రెండు నెలలుగా తల్లిదండ్రుల నుంచి సుమారు ₹50 లక్షలు వసూలు చేసినా,ఇప్పటివరకు ప్రైవేట్ ఉపాధ్యాయుల నియామకం జరగకపోవడం శోచనీయమని అన్నారు.కంప్యూటర్ తరగతుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయుని నియమించాలని డిమాండ్ చేశారు.ఇంకా మాట్లాడుతూ..గతంలో ఎస్ఎంసి చైర్మన్ చేసిన ఆర్థిక,వనరుల దోపిడీకి సంబంధించి విచారణ జరిపి,నష్టాన్ని రికవరీ చేయాలని కోరారు.ప్రస్తుతం ఉన్న తాత్కాలిక పేరెంట్స్ కమిటీ న్యాయబద్ధంగా ఏర్పడలేదని ఆరోపిస్తూ,తక్షణమే ఆ కమిటీని రద్దు చేసి,స్థానిక గ్రామ ప్రజల సమక్షంలో కొత్త కమిటీని ఎన్నిక చేయాలని డిమాండ్ చేశారు.కొత్త కమిటీలో స్థానిక గ్రామస్తులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని,ఇతర గ్రామాల వారిని చేర్చడం సరికాదన్నారు.ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు మంద సదానందం కి వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరుక రాజు,మాజీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెండ్లి నవీన్,గ్రామ సీనియర్ నాయకులు పెండ్లి సంపత్,కనుకటి శంకర్ రెడ్డి,అద్దెంకి రమేష్,మజ్జిగ రాములు,యూత్ నాయకులు మజ్జిగ శ్రీకాంత్,కడుదూరి హరీష్,మామిండ్ల రంజిత్,రాజారపు గణేష్,ఎరుకల బుచ్చిరెడ్డి,గోనె భాస్కర్,గోనె ప్రణయ్,ఉడుత శ్రీకాంత్,పెండ్లి కరుణాకర్,అనుముల శ్రీను,అనుముల మహిపాల్,మహమ్మద్ ఇబ్రహీం,కొట్టం రమేష్,కొట్టం శ్యామ్,రాజబాబు,రాజారపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.