ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లో యూరియా కొరతలేదని మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవరెడ్డి అన్నారు. వారు స్థానిక ఎస్సై సందీప్ కుమార్ తో కలిసి పిఎసిఎస్,ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలను విచ్చేసి తనిఖీ చేసి స్టాక్ వివరాలను,రిజిస్టర్,ధరల పట్టికలను పరిశీలించారు. మండలానికి జూలై నెలలో 309 మెట్రిక్ టన్నులకు గాను బుధవారం నాటికి 284 మెట్రిక్ టన్నులు రావడం జరిగిందన్నారు. రైతులు భూసార కాలుష్యం తగ్గించడానికి 30 నుండి 45 రోజుల పంటలకు నానో యూరియా, నానో డిఎపి లను పంటలపై పిచికారి చేసుకుంటే ఖర్చులు తగ్గి పంట దిగుబడి పెరుగుతుందని తెలిపారు. యూరియా కావాల్సిన రైతులు పట్టాదార్ పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు తో సంప్రదించి యూరియా కొనుగోలు చేయాలని చెప్పారు.