సిపిఎం ఉద్యమ నిర్మాత కామ్రేడ్ ఏసి రెడ్డి నరసింహారెడ్డి 34 వవర్ధంతి సభను జయప్రదం చేయండి.
Uncategorizedసిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనుక రెడ్డి
…..,…………………………………….
జనగామ . సిపిఎం జనగామ ఉద్యమ నిర్మాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జనగామ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ A.C రెడ్డి నరసింహారెడ్డి 34వ
వర్ధంతి సభ జనగామ లోని సాయిరాం కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది ఈ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కోరారు శుక్రవారం రోజున పార్టీ జిల్లా కార్యాలయంలో కరపత్రం విడుదల చేసిన అనంతరం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కనకా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
కామ్రేడ్ ఏసి రెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జనగామ ఆలేరు ప్రాంతాల్లో ముఖ్యమైన భూమిక పోషించడమే కాకుండా ఈ ప్రాంతంలో పీడనకు గురవుతున్న ప్రజలకు రక్షణ ఉండి భూస్వాముల భూములు పేదలకు పంచి ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు కామ్రేడ్ A.N అని అన్నారు . జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు ముఖ్యంగా కరువు ప్రాంతమైన జనగామ డివిజన్ కు సాగునీరు కావాలంటే శ్రీరామ్ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా జనగామ ప్రాంతానికి నీరు అందించాలని అసెంబ్లీలో బయట పోరాటాలు నిర్వహించి న
ఫలితంగా జనగామ ప్రాంతానికి నేడు సాగు
నీరు వచ్చిందన్నారు.
జనగామ ప్రాంత అభివృద్ధికి నిస్వార్ధంగా సేవలందించిన A.C రెడ్డి గారి జులై 28 జరుగుతున్న సభకు జిల్లాలోని పార్టీ కార్యకర్తలు పార్టీ సభ్యులు నాయకులు ఏసి రెడ్డి గారి అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరటం జరిగింది
ఈ సభకు ముఖ్య అతిథిగా
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి పుత్కనూరు ఉపేందర్
నాయకులు దాసగొని సుమ బొట్టు సూరి బొట్టు శివ కనకచారి సౌందర్య బిక్షపతి దామెర అబ్రహం లింకన్
తదితరులు పాల్గొన్నారు.