ధర్మసాగర్ నారాయణగిరి పాఠశాలలో 1983-84 బ్యాచ్ సమ్మేళనం ఈ69న్యూస్ ధర్మసాగర్,జూలై 27-రిపోర్టర్ ప్రణయ్(స్టీఫెన్) హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1983-84 విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించబడింది.సుమారు 41 సంవత్సరాల తరువాత మళ్ళీ ఒకే చోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు బాల్యపు స్నేహాలను తలచుకుంటూ ఆనందంగా గడిపారు.తరగతి గదులను సందర్శిస్తూ,చదివిన రోజుల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా గురువుల పట్ల కృతజ్ఞతా భావాన్ని తెలియజేశారు.పాఠశాలలో అప్పట్లో ఉన్న రెండు తరగతి గదులను చూసి వారు సంతోషభరితులయ్యారు.గదుల్లో ఫొటోలు దిగుతూ బాల్యాన్ని మళ్లీ అనుభవించారు.బెల్లం రాజయ్య,గడ్డం రాజయ్య అనే మిత్రులు ప్రత్యేకంగా ఫొటోలు తీయించుకుని ఆ క్షణాలను మధురస్మృతులుగా ఉంచుకున్నారు.ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల ఐక్యతను,గురువుల పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించింది.ఇది నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.