జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్షను ప్రతిఘటిద్దాం-మామిడి సోమయ్య
Uncategorizedసమస్యల పరిష్కారంలో జాప్యం తగదు-రాష్ట్రవ్యాప్తంగా చైతన్య యాత్ర

ఈ69న్యూస్ షాద్ నగర్,జూలై 27:
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా తప్పుబట్టారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నాగులపల్లి రోడ్డులోని స్వదేశీ కంట్రీ సైడ్ రిసార్ట్స్‌లో నిర్వహించిన టిడబ్ల్యూజేఎఫ్ షాద్ నగర్ డివిజన్ సమావేశం,టీయూడబ్ల్యూజే-143 యూనియన్ విలీన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరయినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవ్వలేదు.గత ప్రభుత్వ మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తోంది.సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాలు తప్పవు,అని హెచ్చరించారు.మెండల స్థాయి జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారిందని, హెల్త్ కార్డులు,అక్రెడిటేషన్ కార్డులు విడుదలలో జాప్యం జరుగుతుండటం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.”సంఘాల పేరుతో ప్రభుత్వ పాలకులు కొన్ని యూనియన్లను ప్రోత్సహించి మీడియా అకాడమీ లాంటి సంస్థలను ప్రైవేట్ స్థాయిలో మార్చేస్తున్నారు”అంటూ ఆయన ధ్వజమెత్తారు.అక్రమ మార్గాల్లో ఎంఫానల్మెంట్,చిన్న,మధ్య తరహా పత్రికల పట్ల ప్రభుత్వం వివక్ష, ఇళ్ల స్థలాల పంపిణీలో అన్యాయం వంటి అంశాలపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు.పాలకులకు ఊడిగం చేసే సంఘాల నుంచి జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజల పక్షాన నిలిచి సమిష్టిగా ఉద్యమించాలి” అని పిలుపునిచ్చారు.
టీడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్లో భారీ చేరిక
ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే-143 రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ జర్నలిస్టు ఖాజా పాషా (కేపీ)తో పాటు వివిధ పత్రికలు,న్యూస్ ఛానళ్లకు చెందిన సుమారు 100 మంది జర్నలిస్టులు టీడబ్ల్యూజేఎఫ్లో చేరారు. వారికి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య స్వయంగా సభ్యత్వం కల్పించి స్వాగతం పలికారు.ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, వల్లాల జగన్ మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని,జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరంగా పోరాడతామని స్పష్టం చేశారు.సభాధ్యక్షత వహించిన షాద్ నగర్ అధ్యక్షుడు రఘునందన్ రావు,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి సైదులు,నేషనల్ కౌన్సిల్ సభ్యులు యర్రమిల్లి రామారావు, దేవేందర్, జిల్లా నాయకులు రఘుపతి రెడ్డి, గణేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.