ఈ 69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండజయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో తనకు ఉన్న పామ్ అయిల్ మొక్కలు పికేసారని రైతూ ఫిర్యాదు చేసిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. రైతు భాస్కర్ల రాజు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేగొండ శివారులోని తనకు మూడు ఎకరాల ఆయిల్ పామ్ ఉంది. కాగా శనివారం అన్నారపు మల్లారెడ్డి, పోలాడి దేవేందర్ రెడ్డి, లావణ్య అనే వ్యక్తులు నేను లేని సమయంలో 35మొక్కలు పికేయడం జరిగింది. కావున నా మొక్కలు పీకేసి నష్టం చేసిన వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితుల పై చర్యలు తీసుకుంటామని ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.