మలేషియాలో గోల్డ్ మెడల్ సాధించాలని ఆశాభావం-బూడిద గోపి

ఈ69 న్యూస్ జనగామ జూలై 28
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన దివ్యాంగ తైక్వాండో క్రీడాకారిణి మాచర్ల కృష్ణవేణి మలేషియాలో జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే ఏషియన్ ప్యారా తైక్వాండో పోటీలలో పాల్గొనేందుకు బయలుదేరారు.ఈ సందర్భంగా జనగామ అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా సెండ్ ఆఫ్ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి మాట్లాడుతూ..కృష్ణవేణి బంగారు పతకం సాధించి దేశ ఖ్యాతిని పెంచాలన్నారు.ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆమె ప్రయాణ ఖర్చులకు స్థానిక సంఘాలు,కౌండిన్య నార్త్ అమెరికా అసోసియేషన్,అభిమానులు సహకారం అందించినట్టు తెలిపారు.కృష్ణవేణి మాట్లాడుతూ..ఇప్పటి వరకు అందరూ ఇచ్చిన సహకారం నాకు ప్రేరణగా నిలిచింది.గోల్డ్ మెడల్ సాధించి భారత్కు గర్వకారణంగా నిలుస్తాను అని ధైర్యంగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు ఇర్రి అహల్య,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసగొని సుమ,కల్లుగీత కార్మిక సంఘం నేతలు బాల్నే వెంకట మల్లయ్య,దూడల రాజా,విశ్వనాథ్ గౌడ్,మడిపల్లి బాబు,కరాటే కోచ్ ఎండి అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.