
ఈ69న్యూస్ హైదరాబాద్ ఆగస్టు 4
హైదరాబాద్ యూసఫ్‌గూడలోని శిశు విహార్‌లో పనిచేస్తున్న సుమారు 130 మంది ఆయమ్మలకు గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై స్టాఫ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు వారు తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్,అధ్యక్షుడు ఎం.వెంకటేష్,ప్రధాన కార్యదర్శి బి.సుశీల మాట్లాడుతూ…వేతనాలు లేకపోవడం వల్ల ఆయమ్మలు కుటుంబాలను పోషించలేని పరిస్థితిలో ఉన్నారు.ఇంటి అద్దె కట్టలేక ఇళ్ల నుంచి బయటకు పంపిస్తున్నారు.పిల్లల స్కూల్ ఫీజు చెల్లించలేక విద్య ఆగిపోయే ప్రమాదం ఉంది అని తెలిపారు.వారు ప్రభుత్వాన్ని పలు కీలక డిమాండ్లతో కోరారు.తక్షణమే 6 నెలల బకాయి వేతనాల చెల్లింపు,ప్రతి నెల 7వ తేదీలోపు జీతాల చెల్లింపు,జీవో 60 ప్రకారం రూ.15,600/- వేతనం అమలు,ఈఎస్ఐ,పిఎఫ్ సదుపాయాల అమలు,నెల వేతనాన్ని 26 రోజులకు లెక్కించి చెల్లించాలి,రిటైర్మెంట్ బెనిఫిట్లు కల్పించాలి,ప్రస్తుతం నెలకు 30 రోజులుగా లెక్కపెట్టి వేతనం చెల్లించడంవల్ల,డబుల్ డ్యూటీ చేసిన రోజులకు తక్కువ జీతం వస్తోందని,దీని వల్ల ప్రతి ఆయమ్మకు వందల రూపాయల నష్టం జరుగుతోందని వారు పేర్కొన్నారు.ఈ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.