
ఈ69 న్యూస్ హనుమకొండ
జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ స్టేట్ సౌత్ జోన్ అథ్లెటిక్ మీట్-2025లో 1000 మీటర్ల మిడ్ రిలే అండర్-16 కేటగిరీలో గంగారపు ప్రభుదేవ్ అండ్ టీమ్ తొలి స్థానం సాధించారు.ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన ఎమ్ఆర్పీఎస్ నాయకుడు గంగారపు శ్రీనివాస్,ప్రశాంత దంపతుల కుమారుడు గంగారపు ప్రభుదేవ్,హనుమకొండ ఫాతిమానగర్‌లోని సెయింట్ గాబ్రియేల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు.ఈ విజయంలో ప్రభుదేవ్తో పాటు రక్షణు,సందీప్,రోహిత్‌లు ప్రముఖ పాత్ర పోషించారు.వీరికి బహుమతులను హనుమకొండ జిల్లా హెచ్.డి.ఏ.ఏ జనరల్ సెక్రటరీ కొదిరిపాక సారంగపాణి,మాజీ కోచ్ & ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు మహేష్ బాబు చేతుల మీదుగా అందజేశారు.ప్రభుదేవ్ తదుపరి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.