
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడప రాదని రేగొండ రెండో ఎస్ఐ షాఖాన్ తెలిపారు.ఈ మేరకు ఆయన బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఇందిరమ్మ బొమ్మ వద్ద వాహనదారులను బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేపట్టారు.మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని,కుటుంబాలను రోడ్డుపాలు చేసి జీవితాలను అర్ధాంతరంగా ముగించవద్దని ఆయన కోరారు.ఈ తనిఖీలలో పలువురు రేగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.