
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లాలో నిన్నటి నుండి కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే స్పందించేందుకు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తోందని తెలిపారు.
భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి వరదలు,శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోవడం,రహదారులు దెబ్బతినడం,చెట్లు కూలిపోవడం వంటి ఘటనలు సంభవించిన సందర్భంలో వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్ 9052308621 కు సమాచారం అందించాలని కోరారు.నియోజకవర్గ ప్రజలందరూ జాగ్రత్తలు పాటించి,సమస్యలు ఎదురైన వెంటనే అధికారుల సహాయం పొందాలని సూచించారు.