
ఈ69న్యూస్ అయినవోలు,ఆగస్టు 12
అయినవోలు మండలంలో ఈరోజు నుండి రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని స్థానిక పోలీసు విభాగం విజ్ఞప్తి చేసింది.ఎస్ఐ పి.శ్రీనివాస్ విడుదల చేసిన ప్రకటనలో,అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని,ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న లేదా పాత ఇండ్లలో ఉండకూడదని సూచించారు.వర్షాకాలంలో తడి పరిస్థితుల్లో మోటార్లు లేదా ఎలక్ట్రిక్ స్టార్టర్లు ఆన్ చేయడం ప్రమాదకరమని,కాబట్టి వాటిని ఉపయోగించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.అలాగే,వర్షాల సమయంలో విద్యుత్ తీగలు లేదా తెగిన వైర్లు తాకరాదు,చాపలు పట్టడానికి వెళ్లరాదు,నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం ప్రాణాపాయమని హెచ్చరించారు.వరద ముంపు ప్రాంతాల వద్ద పిల్లలు ఆడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజల ప్రాణాలు మరియు ఆస్తి రక్షణ మా ప్రాధాన్యత.ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్థానిక పోలీసు స్టేషన్కు సమాచారం ఇవ్వండి” అని ఎస్ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.