మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు


ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రంగయ్య పల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపురం మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మూడవరోజు హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ హనుమాన్ ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు.పోచమ్మ ఆలయానికి ఇప్పటికే నిధులు మంజూరు చేశానని అన్నారు. గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణం కోసం త్వరలోనే నిధులు కేటాయిస్తానని తెలిపారు. గ్రామంలో మధ్యలోనే ఆగిపోయి ఉన్న అంగన్వాడి భవనానికి, సబ్ సెంటర్ భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించి భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తానని తెలిపారు. ఆలయాల్లో నిత్యం ప్రజలు పూజలు చేయాలని కోరారు.దేవుళ్ళు ప్రజలను సుఖసంతోషాలతో,పాడి పంటలతో అభివృద్ధి చెందించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది.గ్రామ ప్రజలంతా విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొని పూజలు నిర్వహించారు.ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గుర్రాల వెంకట్ రెడ్డి, సలహాదారుడు నూనె మురళీధర్, ఉపాధ్యక్షుడు బండి నిరంజన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, పిఎస్ఎ చైర్మన్ నడిపెల్లి విజన్ రావు, మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, జిల్లా నాయకులు పుల్లూరి బాబురావు, మోడం ఉమేష్ గౌడ్, బొజ్జం రవి, ఆలయ కమిటీ సభ్యులు గంధం శ్రీనివాస్, గుర్రాల శ్రీనివాస్ రెడ్డి, అసాల కిషన్ రావు, జమలాపురం మోహన్ రావు, నాయకులు కొమ్మరాజు భాస్కర్, దేశిని రంజిత్,గ్రామస్తులు పాల్గొన్నారు.