
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో వెలిసిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర గుట్టలను గురువారం జిల్లా అధికారులు పరిశీలించారు.ఇటీవలే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జాతరలో మెట్ల వెడల్పు, కళ్యాణ మండపం,కళ్యాణ కట్ట, కోనేరు వెడల్పు, మంచినీటి బావి పునర్నిర్మాణ పనులకు రూ.1.50 కోట్లను కేటాయించారు.దీంతో జిల్లా ఉన్నతాధికారులు గురువారం జాతరను పరిశీలించి పనుల ప్రారంభానికి నమూనాలు తీసుకున్నారు.జాతర సమయానికి పనులన్నీ పూర్తి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ రమేష్,పిఆర్ ఈఈ వెంకటేశ్వర్లు,డిఈ లు రవికుమార్, సతీష్,ఆర్ డబ్ల్యూ ఈఈ శ్వేత, ఏఈ సౌజన్య, ఫారెస్ట్ డివిజన్ అధికారి అప్పల కొండ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నరేష్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గౌతమి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, బుగులోని జాతర చైర్మన్ రొంటాల వెంకటస్వామి, మాజీ చైర్మన్ కట్ల మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గంగుల రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.