
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతులనిశిధర్ రెడ్డి, నూతన జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది.ఈ కమిటీలో రేగొండ మండల కేంద్రానికి చెందిన పెండ్యాల రాజును జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ…. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల యొక్క సమస్యలపై అనేక పోరాటాలు చేసి విద్యార్థి యొక్క సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా బీజేవైఎం మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం మండలంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిదంగా యువ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాదులో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ సాధనలో రేగొండ మండలం నుండి తన వంతు కృషి చేయడం జరిగిందని అన్నారు.ముఖ్యంగా యువతి, యువకులకు నిరుద్యోగ సమస్యలపై మండలంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగులకు అండగా పోరాటం చేయడం జరిగిందని రేగొండ మండల బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి బిజెపి రాష్ట్ర నాయకత్వం ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ముఖ్యంగా రైతుల సమస్యలపైన నిరసన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు చేస్తున్న అన్యాయాలపైన ఎప్పటికప్పుడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా పార్టీ ఆదేశించిన ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజల సమస్యల పైన పోరాటం చేస్తున్న నాకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా భాద్యత అప్పగించినందుకు జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను,అని భూపాలపల్లి నియోజకవర్గంలో కాషాయం జెండా, కమలం జెండా ఎగిరే వరకు నిరంతరం కృషి చేస్తానని తన మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షలు రామచంద్రరావుకి, జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డికి భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి చందుపట్ల కీర్తి-సత్యపాల్ రెడ్డికి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్,మాజీ జిల్లా అధ్యక్షులు కన్నం యుగదీశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న, క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర సభ్యులు నాగపురి రాజమౌళి గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్రారెడ్డికి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి, పార్లమెంటరీ కో, కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాయరాకుల మొగిలి,మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలుసాని తిరుపతి రావు, మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గాలిఫ్ నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.