
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
రోడ్డు నిర్మాణం జరపాలంటూ రోడ్డు పై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామం నుండి వెంకటేశ్వర్లు పల్లి కి వెళ్లు ప్రధాన రహదారి గత కొన్ని సంవత్సరాలుగా ధ్వంసం అయ్యి దుర్భరంగా మారిందని ఎన్ని సార్లు ప్రజా ప్రతినిధులకు,అధికారులకు రోడ్డు మరమ్మత్తులు చేయాలని విన్నవించిన పట్టించుకోవడం లేదని గత వారం రోజులనుండి కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు బురదమయంగా మారి రైతులకు ,విద్యార్థులకు,ప్రయాణికులకు,ఇబ్బందికరంగా మారిందని,ప్రమాదాలు జరుగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని రోడ్డు పై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.