
ఈ69న్యూస్ పర్వతగిరి,ఆగస్టు 15
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ పోలీసు అవార్డులు అందుకున్న పర్వతగిరి ఎస్సై బి.ప్రవీణ్,కానిస్టేబుల్ అనన్యలను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు గుగులోత్ కిషన్ నాయక్,హాటియ నాయక్,రవి నాయక్,రాజేందర్ నాయక్,రాజు నాయక్,మోహన్ నాయక్‌లు శాలువాతో ఘనంగా సత్కారం చేసి అభినందనలు తెలిపారు.ప్రజా భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసు అధికారులను గుర్తించి గౌరవించడం ఆనందకరమని వారు పేర్కొన్నారు.పోలీసు అధికారులు తమ విధుల్లో మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.