
కరాటే టోర్నమెంట్లో మెరిసిన తమ్మడపల్లి(జి)విద్యార్థులు
హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఆల్ స్టైల్ కరాటే అండ్ కుంగ్ఫూ ఓపెన్ టోర్నమెంట్ లో జఫర్ఘఢ్ మండలం తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన విద్యార్థులు ఘన విజయం సాధించారు.9వ తరగతి చదువుతున్న రాపర్తి సాత్విక్,రాపర్తి సంజయ్ తమ ప్రతిభను చాటుకొని పలు విభాగాల్లో మెడల్స్ సాధించారు.ముఖ్యంగా కటా విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకొని తమ గ్రామానికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సీతారామయ్య,ఉపాద్యాయులు సంపత్,సురేష్,కోచ్ అన్నెపు రాజేంద్రం,గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు విద్యార్థుల విజయంపై ఆనందం వ్యక్తం చేసి,వారిని అభినందించారు.భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు