•ర్యాలీలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి


ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద బస్టాండ్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులతో కలిసి బారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగపూరి రాజమౌళి గౌడ్,వెన్నెంపల్లి పాపయ్య బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి, పాల్గొన్నారు.అనంతరం స్థానిక ఎమ్మార్వో శ్వేత రావు కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వనికి చెప్పడంలో ఉన్న చిత్తశుద్ధి పనులు చేయడంలో లేదన్నారు.ఇప్పటివరకు ఆరు గ్యారంటీల పథకాన్ని పూర్తిగా అమలు చేయకుండా కాలక్షేపం చేస్తోందని బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి మండిపడ్డారు.రేగొండ మండలంలోని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని,మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తలకే కాకుండా అర్హులైన నిరుపేదలకు మంజూరు చేయాలని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్య సదుపాయాలు కల్పించాలని, అర్హులైన వారికి నూతన రేషన్ కార్డులు జారీ చేయాలని,రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని,అర్హులైన రైతులకు వెంటనే రుణమాఫీ చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.మండలంలోని పలు గ్రామాలలో గ్రామపంచాయతీ లకు కేటాయించిన ట్రాక్టర్లు రిపేర్లతో మరుగున పడ్డాయని,పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైందని,గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపెల్లి ప్రసాద్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు రవి కిరణ్, పెండల రాజు,జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి,జిల్లా నాయకులు బుచ్చిరెడ్డి, లింగారెడ్డి,గోపాల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి తూర్పటి మల్లేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గలీఫ్ శివకృష్ణ,నరహరి దేవేందర్, అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.