జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలోని వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులపై హైదరాబాద్ లోని ఎమ్మెల్యే, నివాసంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి అధ్యక్షత వహించారు.ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే ₹1 కోటి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులతో చేపట్టబోయే పనులను కళ్యాణ మండపము, అన్నదాన సత్రం, పనులను తక్షణమే ప్రారంభించి, ఆలయాన్ని భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఎండోమెంట్స్ శాఖ అధికారులను ఆదేశించారు.ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ. వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం కడవెండి గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చే దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో మౌలిక వసతులను త్వరగా పూర్తి చేయాలి. రహదారి సౌకర్యాలు, దీపాలంకరణ, తాగునీటి సౌకర్యం వంటి పనులను ప్రాధాన్యతతో చేపట్టాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎండోమెంట్స్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నిధులు మంజూరైనందుకు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.