
ఈ69న్యూస్ ఐనవోలు ఆగస్టు 30
హనుమకొండ జిల్లా,అయినవోలు మండల కేంద్రంలోని స్టబుల్ స్టేషన్ నుంచి బైపాస్ రోడ్డు,మాషణ పెళ్లి చెరువు మీదుగా కక్కీరాల పెళ్లిపెద్దమ్మ గుడి వరకు వెళ్లే పురాతన రహదారి తీవ్రంగా దెబ్బతిన్నది.ఒకప్పుడు ఈ రహదారిపై బస్సులు కూడా నడిచేంత సౌకర్యం ఉండేదని స్థానికులు చెబుతున్నారు.కానీ,గత కొన్నేళ్లుగా ఏ మాత్రం మరమ్మత్తులు చేయకపోవడంతో ఇప్పుడు ఈ దారి పూర్తిగా పాడైపోయింది.ఈ రహదారి రైతుల వ్యవసాయ పనులకు ప్రాణదారి వంటిది.యూరియా బస్తాలు,విత్తనాలు,పండించిన పంటలను రవాణా చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ట్రాక్టర్,ఎడ్లబండి మాత్రమే కాదు,కనీసం సైకిల్ లేదా కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ని సమస్యపై సంప్రదించినప్పటికీ ఫలితం రాలేదని స్థానికులు పేర్కొన్నారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే నాగరాజు ముందుకు వచ్చి రహదారి మరమ్మతులు చేయించి రైతులకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు.“అన్నం పెట్టే రైతు ఈ విధంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలి.రహదారి మరమ్మతు జరిగితే మా వంటి వందలాది రైతుల జీవనోపాధి సులభం అవుతుంది”అని రైతు బిడ్డ నల్లబెట్ట చిన్న రాజు యాదవ్ విజ్ఞప్తి చేశారు.