
ముప్పారం గ్రామ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా- తాళ్లపల్లి విజయ్
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో ఆటో యూనియన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తాళ్లపల్లి విజయ్ నూతన అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. ఉపాధ్యక్షుడిగా సులుగురి రాజు , క్యాషియర్‌గా కాసగోని యాకయ్య, కార్యదర్శిగా సులుగూరి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఆటో యూనియన్ సీనియర్ నాయకులు కోతి సుధాకర్, గోల్లపల్లి రమేష్, బోనగాని నరసింహస్వామి సమక్షంలో గ్రామంలోని ఆటో డ్రైవర్ల సర్వసమ్మతితో ఈ ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్తగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, అందరూ ఐక్యంగా ముందుకు సాగేందుకు కృషి చేస్తామని తెలిపారు.