
స్టేషన్‌ఘనపూర్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు శనివారం స్టేషన్‌ఘనపూర్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజి రెడ్డి హాజరై మాట్లాడుతూ..ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటు అని అన్నారు.రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని,లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేసి కాంగ్రెస్ నాయకులను ప్రజల్లో తిరగనీయమని హెచ్చరించారు.దహనానంతరం పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు.కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కో-కన్వీనర్ ఇనుగాల యుగేందర్ రెడ్డి,దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రడపాక ప్రదీప్,బీజేవైఎం రాష్ట్ర నాయకులు కొలనుపాక శరత్‌కుమార్,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.