ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ మహానీయ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సర్వు రజిన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి గౌరవించారు.విద్యారంగ అభివృద్ధిలో గురువుల పాత్ర అపారమని,వారు చూపే మార్గదర్శకత్వం వల్లే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తూ,ఉపాధ్యాయులు చూపిన మార్గంలోనే నడిచి ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.