ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి న్యూస్ కొత్తపల్లి గోరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోనీ గ్రామాలలో ఊరూరా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపుకు చేరాయి.ఈరోజు భక్తుల కోలహాల మధ్య,మహిళల కోలాటాల మధ్య గణనాథుడిని ఘనంగా నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. నవరాత్రులు పూజలు పొందిన గణనాథుడు అంగరంగ వైభవంగా భక్తుల కోలహాల మధ్య గంగమ్మ ఒడి కి బయలుదేరారు.గ్రామాలలో చిన్న పెద్ద అంతా కలిసి కులమత బేధాలు లేకుండా గణేశుని శోభ యాత్రలో పాల్గొంటు భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ గణనాధుని కి కడసారి వీడ్కోలు పలుకుతూ ఆనందోత్సాహాల మధ్య గంగమ్మ ఒడి కి చేర్చారు.