#Mahabubabad #Maripeda #CollectorVisit #TelanganaNews #LocalNews #E69NEWS #TeluguNews #DistrictCollector #VillageVisit
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా ను సరఫరా చెయ్యాలి
సీజనల్ వ్యాధులు రాకుండా హాస్టళ్లలో పరిశుభ్రత పాటించాలి
మహబూబాబాద్ జిల్లా తెలుగు గళం న్యూస్.
మహబూబాబాద్ జిల్లా మరి పెడ మండల కేంద్రంలో ని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,సుడిగాలి పర్యటన చేశారు మరిపెడ మండలంలోనీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయలను పర్యటించారు,మరిపెడ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యూరియా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి సరఫరా చేస్తున్న ప్రక్రియను పారదర్శకంగా ప్రతి ఒక రైతుకు అందే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని, సూచించారు. వచ్చిన రైతులకు నీడ మంచి నీటి వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చెయ్యాలని సూచించారు,యూరియా అమ్మకాల రిజిస్టర్ ఎప్పటికి అప్పుడు నమోదు చెయ్యాలని యూరియా పంపిణీ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు,మరిపెడ మండలంలో గిరిపురంలో ఉన్న కేజీబీవీ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు,
హాస్టల్లోని డైనింగ్ హాల్, స్టోర్ గది, కిచెన్ షెడ్, పరిసరాలను పరిశీలించారు,
పిల్లలకు షెడ్యూలు ప్రకారం సూచించిన విధంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, వైద్య పరీక్షలు, ప్రతి సబ్జెక్టు పై అవగాహన డిజిటల్ తరగతులు క్రీడా సాంస్కృతిక విభాగాలలో శిక్షణలో అందించాలని సూచించారు,కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడిఏ విజయ్ చందర్, ఏఓ వీరసింగ్,స్థానిక తహసిల్దార్ కృష్ణవేణి, ఆర్ ఐ శరత్ చంద్ర గౌడ్,తదితరులు ఉన్నారు.