వర్షాకాలం మొదలైనా… ఎరువు కోసం ఎగబడుతున్న తెలంగాణ రైతులు


ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
వర్షాకాలం ఊరించే వానలతో తెలంగాణ పొలాలు తడుస్తున్నా, రైతన్న మన్ను పరిమళంలో కాదు,ఎరువు దుకాణం క్యూలో కనిపిస్తున్నాడు.రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో యూరియా ఎరువు కొరత తీవ్రంగా కనిపిస్తోంది.దీంతో విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు తమ పంటల భవిష్యత్తు కోసం ఆందోళనలో పడుతున్నారు.
పొలాల్లో విత్తనాలు… చేతుల్లో ఖాళీ బస్తాలు
రైతులు నాటి వేసే పనులు పూర్తిచేస్తే,అగ్నిపరీక్ష మాత్రం ఎరువు కోసం మొదలవుతోంది. ఉమ్మడి రేగొండ మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఉదయం 4 గంటలకు లేచి,దుకాణాల దగ్గర తమ ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ లతో సహా కుటుంబం మొత్తం దుకాణాల ముందు గీసిన గీతల మధ్య నిలబడి,ఎప్పటికీ రానీ యూరియా కోసం వేచి చూస్తున్నారు.
ఒక్క బస్తా యూరియా అయినా దొరకాలని కోరిక.పంట మొలకెత్తిన పది రోజుల్లో ఎరువు పడకపోతే అది చనిపోయినట్టే.కానీ మా సమస్యల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ అన్ని గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యూరియా బస్తా ధర రూ.266,కనీసం బ్లాక్లో కొందామన్న యూరియా బయట వ్యక్తులు ఎవరు అమ్మడం లేదు.రైతు బతుకుకు బాసటగా నిలవాల్సిన యూరియా,కొరత కారణంగా రైతు ప్రాణాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.మార్కెట్లో ఎవరితో మాట్లాడినా చెప్పేది ఒకటే ‘స్టాక్ లేదు’,కొరత వెనుక కారణాలు ఏమిటి..వాస్తవానికి యూరియా కొరత తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు.దేశవ్యాప్తంగా యూరియా ఉత్పత్తిలో ఆటంకాలు,సరఫరా సమస్యలు,రవాణా ఆలస్యం,మరియు అకస్మాత్తుగా వర్షపాతం వల్ల డిమాండ్ పెరగడం వంటి అంశాలు దీని వెనుక ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కోటా సరిపోక,రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోట మొత్తంలో ఆలస్యం ఏర్పడిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ప్రభుత హామీలే గానీ సహాయం ఎప్పుడొస్తుందో,వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఇది తాత్కాలిక సమస్య మాత్రమే.దేశస్థాయిలో సరఫరా నిబంధనల వల్ల కొంత ఆలస్యం జరుగుతోంది.త్వరలోనే కొత్త స్టాక్ వస్తుంది.అవసరమైతే గ్రామ స్థాయిలో ప్రత్యేక పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అని వెల్లడించారు.
అయితే గ్రామీణ స్థాయిలో రైతులు మాత్రం ఈ హామీలపై విశ్వాసం లేక తలలు పట్టుకుంటున్నారు.వెంటనే ప్రభుత్వం స్పందించి యూరియా స్టాక్ సరఫరా వేగవంతం చేయాలి,ప్రత్యక్ష పంపిణీకి బదులుగా డిజిటల్ టోకెన్ పద్ధతిలో యూరియా గ్రామ గ్రామాలలో పంచాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రభుత్వం కూడా రైతులకు
ప్రత్యామ్నాయ ఎరువులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి,నానో యూరియా యొక్క ఆవశ్యకతను ఇలాంటి సందర్భాలలో ప్రతి రైతుకు అర్థమయ్యేలా గ్రామ గ్రామలలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించాలి.యూరియా అందక పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం హామీ ప్రభుత్వం ఇవ్వాలని రైతులు కోరారు.తెలంగాణ రైతు మట్టిని నమ్ముకున్నవాడు.కానీ ఇప్పుడు అదే మట్టి తడుస్తున్నా,రైతు హృదయం మాత్రం ఎండిపోతోంది,ఎందుకంటే పంట రక్షణకు అవసరమైన యూరియా ఎరువు చేతుల్లో లేదు.
ఈ పరిస్థితిలో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే,వేల ఎకరాల్లో పంటలు చనిపోతాయి,లక్షలాది కుటుంబాలు అప్పుల ఊబిలో పడతాయి.రైతు అడిగేది పెద్దది కాదు,నాకు యూరియా కావాలి… నా పంట బతకాలి,ఈ ఓపికను వదలకుండా,ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి.
https://shorturl.fm/ymwSI