కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కొలిపాక సతీష్ దరఖాస్తు
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కొలిపాక సతీష్ నేడు అధికారికంగా తన దరఖాస్తును సమర్పించారు.ఈ కార్యక్రమం స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఆబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్,షాదనగర్ ఎమ్మెల్యే శంకరయ్య,అలాగే స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఆవేజ్ శ్రీకాంత్ యాదవ్ కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగాకొలిపాక సతీష్ మాట్లాడుతూ..తాను గత 27 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నానని తెలిపారు.ఆయన ఇప్పటివరకు ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు,వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి,ఉపాధ్యక్షుడు,ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి,అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి మరియు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని చెప్పారు.అలాగే ఆయన ప్రభాగ కమిటీ సభ్యుడిగా,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ (ఎల్‌డీఎం)గా మరియు హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీందేవరపల్లి మండలం జై బాపు-జై భీమ్-జై సంవిధాన్ ఇంచార్జ్‌గా పనిచేశారని తెలిపారు.తాను బీసీ వర్గానికి చెందినవాడిగా పార్టీకి చేసిన సేవలను గుర్తించి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అవకాశం కల్పించాలని కోరారు.