 
                                                      
                                                పల్స్ పోలియో మనందరి సామాజిక ఆరోగ్య బాధ్యత
పోలియో రహిత భారతదేశం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం హనుమకొండ ప్రభుత్వ మాతృశిశు ఆసుపత్రి (GMH)లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, నగర మేయర్ గుండు సుధారాణి, KUDA చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి,జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్,మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..0-5 ఏళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల సామాజిక బాధ్యత.ఈ కార్యక్రమం ద్వారా మనం చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు,దేశాన్ని పోలియో రహితంగా మార్చేందుకు సహకరిస్తున్నాం అని అన్నారు.
 
         
         
         
         
        