వయోజనులు,యువకులు సమాజ సంస్కరణకు పాటు పడాలి
రామచంద్రాపురంలో ఘనంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వయోజన,యువజన సంఘం వార్షిక ఇజ్తిమా తూర్పుగోదావరి జిల్లా,సీతానగరం మండలం,రామచంద్రపురం గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ శాఖలు వయోజన,యువజన సంఘాల ఆధ్వర్యంలో వార్షిక ఇజ్తిమా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి జాతీయ ప్రతినిధిగా తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జి ముహమ్మద్ సిరాజ్ అహ్మద్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా సిరాజ్ అహ్మద్ మాట్లాడుతూ..వయోజనులు,యువకులు సంయుక్తంగా సమాజ సంస్కరణకు పాటు పడాలని పిలుపునిచ్చారు.నేడు ప్రపంచంలో నెలకొన్న అశాంతికి ప్రధాన కారణం ప్రజలలో ధార్మికత(మతపరమైన/దైవభీతి) లోపించడమేనని ఆయన అన్నారు.అహ్మదీయ ముస్లింలు ధార్మికతను మరింత పెంపొందించుకోవాలని ఉపదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుల్తాన్ అహ్మద్,వయోజన శాఖ అధ్యక్షుడు సిలార్ అహ్మద్,పశ్చిమగోదావరి వయోజన సమితి జిల్లా అధ్యక్షుడు రిజ్వాన్ సలీం,స్థానిక అధ్యక్షులు మస్తాన్ వంగలపూడి,వయోజన సమితి అధ్యక్షుడు అహ్మద్ అలీ,స్థానిక మౌల్వీలు అక్బర్,తారిఫ్,మెనుపాషా, హ్యుమానిటీ ఫస్ట్ రాష్ట్ర ఇంచార్జ్ ఇస్మాయిల్,నూరుల్ ఇస్లాం శాఖ స్టేట్ కోఆర్డినేటర్ జావీద్ అహ్మద్,అమలాపురం పట్టణం అధ్యక్షులు మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.