
ఏసిరెడ్డి నగర్ కాలనీలో వసతులు కల్పించాలి
జిల్లా కలెక్టరేట్ కోసం తమ స్థలాలు త్యాగం చేసిన ఏసిరెడ్డి నగర్ వాసులకు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది.జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి,పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.కాలనీలో సీసీ రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోయి,ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని నేతలు తెలిపారు.కలెక్టరేట్ కోసం త్యాగం చేసిన వారిని విస్మరించడం అన్యాయమని అన్నారు.తక్షణమే ప్రత్యేక బడ్జెట్ కేటాయించి,ఈ కాలనీని మోడల్ కాలనీగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్‌కు మెమోరాండం సమర్పించారు