
కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
గ్రేటర్ వరంగల్ నగరంలోని సుబేదారి ప్రాంతంలో బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు.ఈ దాడిలో కార్పొరేటర్ భర్త సహా మొత్తం 11 మందిని అరెస్టు చేశారు.వివరాల్లోకి వెళ్తే… వరంగల్ నగరంలోని సుబేదారి కనకదుర్గ కాలనీలో గ్రేటర్ వరంగల్ బీజేపీ కార్పొరేటర్ గుజ్జుల వసంత నివాసంలో పేకాట శిబిరం నడుపుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.దీని ఆధారంగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు.ఈ దాడిలో కార్పొరేటర్ గుజ్జుల వసంత భర్త గుజ్జుల మహేందర్ రెడ్డి తో పాటు మరో 10 మందిని (వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.60 వేలు నగదు,9 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు అయిన వారిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరం నడుపుతూ పట్టుబడటం నగరంలో చర్చనీయాంశమైంది