
ఎమ్ఆర్ఓ ఆఫీస్ ముట్టడి
సుప్రీంకోర్టు సిజెఐపైన దాడి చేసిన వ్యక్తి పైన దేశద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి ఎమ్ఆర్పిఎస్ పరకాల మండల ఇంచార్జీ అంకిల్ల రాజు మాదిగ ఎమ్ఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు ఎమ్ఆర్పిఎస్ పరకాల మండల కో ఇంచార్జీ సుంచు రజిని కుమార్ మాదిగ ఆధ్వర్యంలో అమరధామం నుండి నిరసన ర్యాలీ చేపట్టి పరకాల మండల ఎమ్ఆర్ఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
పరకాల మండల ఇంచార్జీ అంకిల్ల రాజు మాదిగ హాజరైనారు వారు మాట్లాడుతూ జస్టిస్ బిఆర్ గవాయి మీద కోర్టులో జరిగిన దాడిని కేవలం అది ఆయన మీద జరిగిన దాడిగా కాకుండా యావత్తు భారతదేశంలో ఉన్న దళితుల మీద జరిగిన దాడిగా భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిగా ఈ భారత దేశ న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా చూస్తున్నట్టు ఆయన తెలిపారు.సిజెఐపై దాడి చేసిన రాకేష్ కిషోర్ అనే లాయర్ కుల దురాహంకారంతోనే దాడి చేశాడని అది వ్యక్తిగత కక్షతోనే దాడి చేశాడని అర్థమవుతుందని అన్నారు.ఇప్పటికైనా ఈ కుల దురాహంకారాలు మానుకొని దళితుల మీద దాడులు చేసుడు మానుకోవాలని హెచ్చరించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా రాకేష్ కిషోర్ పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఎమ్ఆర్ఓ కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వెంకటాపురం చిరంజీవి మాదిగ,
పైడిపల్లి రమేష్ మాదిగ,ఎండి. రిజ్వాన్,శివకుమార్ మాదిగ,అంజి మాదిగ,శివ మాదిగ,అవినాష్ మాదిగ,
సాయి మాదిగ,కమల్, బన్నీ, ఉమా మహేశ్వర్,మణిదీప్మరియు తదితరులు పాల్గొన్నారు.