
మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు
పార్టీని కాపాడేందుకు సొంత ఆస్తులు అమ్ముకున్నానని,కానీ చివరికి పార్టీ తనను మోసం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ నుండి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు.నాతో పాటు బీజేపీ నుండి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి,ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు.కానీ నన్ను పక్కన పెట్టారు”అని విమర్శించారు.“పార్టీ కోసం నేను నా ఆస్తులు అమ్ముకుని కష్టపడ్డాను.మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి చివరికి మోసం చేశారు.నాకు మంత్రి పదవి రాకుండా కొందరు నాయకులు అడ్డుపడుతున్నారు”అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో మళ్లీ చర్చకు దారితీశాయి.