
యువత స్వయం ఉపాధిని సృష్టించుకోవాలి
యువత స్వయం ఉపాధిని సృష్టించుకుని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.శుక్రవారం మండలంలోని భాగిర్తిపేట గ్రామంలో బోయిని రాజు సంధ్య దంపతుల శ్రీ లక్ష్మీనరసింహ అనన్య మెడికల్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు కాలాన్ని వృధా చేయకుండా ఆయా రంగాలలో స్వయం ఉపాధిని సృష్టించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరసయ్య, కాంగ్రెస్ నాయకులు షబీర్,వెంకటస్వామి,నీరటి భద్రయ్య, ఉపేందర్, రఘుపతి, శ్రీను, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.