రైతుల అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు మాల్యాతండా పరిధిలోని పంచారాయి తండాకు చెందిన రైతులు బానోత్ హల్య,బానోతు రాములు, మొక్కజొన్న పంటను వరంగల్ ఎనుముల మార్కెట్ కు తరలిస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు లోడ్ కూలిపోయి అక్కడికక్కడే మృతిచెందగా గ్రామానికి చేరుకొని వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని నింపిన అనంతరం వారి అంతిమ యాత్రలో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గారితో సొసైటీ చైర్మన్ యం. మనోజ్ గౌడ్ , మండల పార్టీ అధ్యక్షులు&మాజీ వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు మాజీ జిల్లా రైతు బంధు సభ్యులు చింతపట్ల సోమేశ్వర్ రావు మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, మాజీ మండల రైతు బంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్ చౌటపల్లి మాజీ సొసైటీ చైర్మన్ గంధం బాలరాజు , ఎస్టి సెల్ మండల అధ్యక్షులు భూక్యా రవి, గ్రామ పార్టీ అధ్యక్షులు మసాని వెంకట్,సోషల్ మీడియా నాయకులు దబ్బేట నరేష్,రంజిత్ బానోత్ తిరుపతి, భూక్యా వెంకన్న,మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.