ప్రజలను ప్రత్యక్షంగా పలకరిస్తున్న సర్పంచ్ అభ్యర్థి
రేగొండ గ్రామ పంచాయతీ 8వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి కొలెపాక వజ్ర–బిక్షపతి తన ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు.ప్రతి ఇంటిని వ్యక్తిగతంగా సందర్శిస్తూ ప్రజలతో మాట్లాడి వారి అవసరాలు, దైనందిన సమస్యలు, గ్రామం ఎదుర్కొంటున్న వాటిపై వివరంగా తెలుసుకుంటున్నారు. ప్రజల మాట వింటూ, వారి అభిప్రాయాలను గమనిస్తూ ప్రజలతో గట్టి అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు.
గ్రామాభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా తీసుకొని రేగొండను ఆధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని బిక్షపతి స్పష్టం చేశారు. గ్రామంలో రహదారుల మెరుగుదల, శుద్ధమైన మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యాలు, స్వచ్ఛమైన పాలన, సంక్షేమ పథకాల పారదర్శక అమలు,అలాగే ప్రజలను ఇబ్బందిపెట్టే కోతులు, కుక్కల బెడద నిర్మూలన వీటన్నింటినీ అత్యున్నత ప్రాధాన్యాలతో అమలు చేస్తానని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో గ్రామ అభివృద్ధికి దోహదపడే బలమైన నాయకత్వం అవసరమని చెబుతూ,కత్తెర చిహ్నానికి తమ విలువైన ఓటును ప్రజలు వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల ఆదరణ, ఆశీస్సులతో ప్రజా సంగమ యాత్ర మరింత ఉత్సాహంగా, వేగంగా కొనసాగుతున్నట్లు చెప్పారు.