మరిపెడ మండలం దంట్ల కుంట తండా
మహబూబాబాద్ జిల్లా తెలుగు గళం.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దంట్ల కుంట తండా గ్రామపంచాయతీ శివారు దుబ్బ తండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా భానోత్ విజయ నామినేషన్ దాఖల్ చేశారు. దంట్లకుంట తండా, దుబ్బ తండా ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచిగా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తానన్నారు. గ్రామ ఓటర్ల నిర్ణయం మేరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని ఓటర్లకు ఇచ్చిన హామీ నెరవేరుస్తానని చెప్పారు. వారి వెంట భానోత్ ప్రసాదు దుబ్బ తండ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు.