లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం - ఎన్ సీ రాజమౌళి
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం – ఎన్ సీ రాజమౌళి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ శుక్రవారం 5 వ సంవత్సరం 157 వ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో భాగంగా తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం అని అన్నారు అనంతరం లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా,లయన్ గుడాల రాధాకృష్ణ,మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా శాస్త్రుల యశస్విని శర్మ జన్మదిన, ఆర్యవైశ్య సీనియర్ నాయకులు దూబకుంట లక్ష్మణ్ జన్మదిన పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారంతో పాటు బ్రెడ్, అరటి పండ్లు,నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కొమరవెల్లి ఆలయ కమిటీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య,లయన్ దొంతుల సత్యనారాయణ, లయన్ మల్లేశం గౌడ్,లయన్ దూబకుంట లక్ష్మణ్, శాస్త్రుల హరిత రాజేశ్వర శర్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు