లోక్ సభలో గళమెత్తిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
బేటీ బచావో-బేటీ పడావో అంటూ ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బాలికల భద్రత విషయంలో ఏం చేస్తుందంటూ వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య లోకసభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఇటీవల ఒడిశాకు చెందిన ఒక దళిత మహిళా,తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ చదువుతున్న విద్యార్థినిని అవమానకరంగా వేధింపులకు గురిచేయడంతో ఆమె చదువు మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎంపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.ఈ విషయాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య లేవనెత్తారు. దేశంలోని విద్యాసంస్థల్లో బాలికలు,మహిళా విద్యార్థులపై ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.బేటీ పడావో అన్న నినాదం పాఠశాల గోడలకే పరిమితమా?విద్యాలయాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న యువతులకు రక్షణ ఎక్కడ? అని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కేంద్రాన్ని ప్రశ్నించారు.దేశంలో విద్యా సంస్థల్లో మహిళల భద్రతను కాపాడే వ్యవస్థలు ఎంత వరకు పనిచేస్తున్నాయో తెలియజేయాలన్నారు.అంతేకాకుండా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మరో ముఖ్య అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు.వివిధ రాష్ట్రాల్లో,ప్రత్యేకించి విశ్వవిద్యాలయల్లో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్నదని ఎంపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఈ ప్రమాదకర ధోరణిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అయితే ఎంపీ డా.కడియం కావ్య అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇవ్వకుండా ముందుకు సాగిపోవడంతో,డా.కావ్యతో పాటు పలువురు సభ్యులు “న్యాయం చేయాలి…జవాబు ఇవ్వాలి”అని డిమాండ్ చేస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు.దళిత మహిళా స్కాలర్పై జరిగిన ఘటనపై ప్రభుత్వం స్పందించాలని,మహిళా విద్యార్థుల భద్రతకు బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేసారు.