ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపించి గ్రామాలను మరింత అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తామని డోర్నకల్ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని , గుండేపూడి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పెద్దపులి శ్రీనివాస్, అనేపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మల్లికంటి వసుమతి యాకన్న,నీలికుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తొట్టి గౌతమ్, ఉమ్మడి మున్య తండా, దాస్య తండా, రేఖ్య తండా సర్పంచ్ అభ్యర్థి బానోత్ పార్వతి మనోహర్,లచ్చ తండా సర్పంచ్ అభ్యర్థి బానోత్ కర్ణ,బాల్య తండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జరుపుల విజయ్,అజ్మీరా తండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బానోత్ లైలా సురేష్,లునవత్ తండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లునవత్ సోనియా వెంకన్న,ఊళ్లేపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నవీలే సావిత్రి,గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ గత బి ఆర్ఎస్ పాలనలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడని,దోచుకుతిన్నారారని దుయ్యబట్టారు, కాంగ్రెస్ పాలన వచ్చాక కేసీఆర్ చేసిన అప్పులకి ప్రతి ఏటా ఒక లక్ష యాభై వేల కోట్ల వడ్డీ కడుతున్నామని అన్నారు.అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలన వచ్చిన రెండు సంవత్సరాలలో రెండు లక్షల మంది రైతులకు రుణ మాఫీ,ఆడపడుచులకు ఉచిత బస్సు, రేషన్ కార్డులు, నిరుద్యోగులకు 65 వేల ఉద్యోగాలు, ఉచిత కరెంటు, సన్నబియ్యం, మహిళ సంఘాల ఆడపడుచులకు చీరలు,లాంటి అనేక సంక్షేమ పథకాలు అందించిందని ఆయన అన్నారు.నమ్మి బి ఆర్ఎస్ కి ఓటు వేస్తే అది మోడీకి, వేసినట్లేననీ అన్నారు. దున్న పోతు కి గడ్డి వేసి బర్రె ను పాలు ఇవ్వమనే చందంగా ఉంటుందని అధికారంలో లేని బిఆర్ఎస్ పార్టీ కి ఓటు వేసి గెలిపిస్తే గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల కు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రజలకు ఆయన సూచించారు. ప్రచార కార్యక్రమం లో జిల్లా నాయకులు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, యువ నాయకులు నూకల అభినవరెడ్డి, కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కొంపెల్లి సురేందర్ రెడ్డి,రాంలాల్,పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, అఫ్జల్,రవి నాయక్,నాయకులు, మహిళలు, తదితర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.