పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గుర్తు చేశారు. ఈ సందర్భంగా, జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో తీసుకున్న జాగ్రత్తలపై కలెక్టర్ మీడియాకు వివరించారు.