ఓటు వేసే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత మాది
420 హామీలతో మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ
బిఆర్ స్ అభ్యర్థి గెలుపుకోసం ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం
కేసముద్రం మార్కెట్ మాజీ వైస్ చెర్మన్ రాంపెల్లి రవి గౌడ్
రాంపురం బిఆర్ స్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము చెంద్రశేఖర్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము చెంద్రశేఖర్ గ్రామంలోని ప్రతి వార్డులో కలియ తిరుగుతూ ప్రతి ఓటర్లు కలుస్తూ ఓటును అభ్యర్థించడం జరిగింది. ఓటు వేసే బాధ్యత మీదని గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది మా బి ఆర్ స్ పార్టీ ది అని గ్రామ ప్రజలకు తెలియజేశారు. గ్రామంలోని ఓటర్లను కలుస్తూ ఉత్సాహంగా ప్రచార కార్యక్రమంలో ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కేసముద్రం మార్కెట్ మాజీ వైస్ చేర్మెన్ రాంపెల్లి రవి గౌడ్ మాట్లాడుతూ మోసపోతే గోసా పడతావని ఇప్పటికే మోసపోయి గోస పడుతున్నామని, 420 హామీలతో మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు,రెండు సంవత్సరాల పాలలో తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని,మేమే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు, మా రైతన్నలకు రైతుబంధు ఎగగొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు, మన బి ఆర్ ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఒక్కసారి కూడా రైతుబంధు ఆపకుండా ఇచ్చామని తెలిపారు, రైతన్నలకు బోనస్ పేరుతో మోసం చేశారని సన్నవోడ్లు చేస్తే బోనసిస్తామని చెప్పి ఎంతమందికి వేసారని,రైతన్నలకు బోనస్ పేరుతో మోసం చేశారని దుయ్యబట్టారు,మన రైతన్నలకు మన ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా చేశామని,కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొరత ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం లో ఏది కొరత ఉంటుంది అని తెలియజేసారు, మా ఆడబిడ్డ లకు కల్యాణలక్ష్మి ద్వారా తలం బంగారం ఇస్తామని చెప్పి, మొండి చెయ్యి చూపించారు అని అన్నారు,వచ్చే ప్రభుత్వం మాన బి ఆర్ స్ ప్రభుత్వం ఏ అని, మన నాయకులు మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చేర్మెన్ నవీన్ రావు, మా శాసనసభ్యులు రెడ్యానాయక్ ఆశీస్సులు తో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పథo లోకి తీసుకుపోతాము అని వారు తెలిపారు,మన అభ్యర్థి నీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని గ్రామ ప్రజల్ని వేడుకున్నారు, సర్పంచ్ అభ్యర్థి కొమ్ము చెంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ప్రధాన ద్యేయం అని ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి బాటలో ముందడుగు వేస్తానని, గ్రామం లోని మంచినీటి కొరత లేకుండా చూస్తానని, గ్రామం లోనీ వీధి లైట్స్ సమస్య లేకుండా చేస్తానని, గ్రామానికి ఇరువైపులా సి సి కెమెరా ల ఏర్పాటు, గ్రామం లోని పెన్షన్ రాని అవ్వ, తాతలకు పేంక్షన్ పెట్టె బాధ్యత తీసుకుంటా అని, గ్రామం లో నీ రైతులకు యూరియా కొరత లేకుండా సరిపడా యూరియా అందేవిదంగా చెర్యలు తీసుకుంటానని,గ్రామ ప్రజల అండదండలతో గ్రామ ప్రజల ఆశీస్సులతో బ్యాలెట్ పేపర్ లోని క్రమ సంఖ్య ఒకటి లో ఉన్న ఉంగరం గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి, నన్ను మీ ఇంటి బిడ్డగా దీవించాలి అని సర్పంచ్ గా తనను గెలిపించాలని కొమ్ము చెంద్రశేఖర్, రాంపురం గ్రామ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ వైస్ చెర్మన్ రాంపెల్లి రవి గౌడ్, మాజీ ఎంపీటీసీ కొమ్ము నరేష్, సీనియర్ నాయకులు గ్రామ పెద్ద గౌడ్ రాంపెల్లి నాగన్న గౌడ్, దోమల సత్తయ్య, రాంపెల్లి చిన్న వెంకన్న, రాజయ్య వెంకన్న,దోమల లక్ష్మణ్ గౌడ్, తాళ్ల కార్తీక్ గౌడ్,ఈరగని డాక్టర్ రమేష్ , చిర్ర చంద్రయ్య,పాల్వయి ఎల్లయ్య, బందు పర్శరాములు, కోడి శ్రీకాంత్, బోర సతీష్,అనంతగిరి స్వామి, కొమ్ము ఉప్పలయ్య,తదితరులు పాల్గొన్నారు