సిఐటియు జెండా ఆవిష్కరణలు విజయవంతం
సిఐటియు అఖిలభారత 18వ మహాసభల సందర్భంగా డిసెంబర్ 15వ తేదీన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడాయి.డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సిఐటియు అఖిలభారత మహాసభల పిలుపులో భాగంగా,ఈరోజు కార్మికులు తమ పనిచేసే ప్రాంతాల్లోను,నివాస ప్రాంతాల్లోని ఇండ్ల వద్దను సిఐటియు జెండాలను ఆవిష్కరించారు.వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని చెస్ట్ హాస్పిటల్లో కార్మికులు జెండాను ఎగరవేసి,కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.ఈ లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు దీక్షతో,పట్టుదలతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.లేబర్ కోడ్ల ద్వారా కార్మికులకు కనీస వేతనాలు అడిగే హక్కును తొలగించారని,సమ్మె చేసే హక్కును పరిమితం చేశారని,ఎనిమిది గంటల పని దినాన్ని నిర్వీర్యం చేశారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.ఫిక్స్డ్ టర్మ్, అప్రెంటిస్ విధానాల పేరుతో పెట్టుబడిదారులు,పారిశ్రామికదారులు,కాంట్రాక్టర్లు కార్మికులను దోచుకుంటున్నారని విమర్శించారు.పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాల్సిన అంశం లేబర్ కోడ్లలో ఎక్కడా లేదని,యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కార్మికులు జీవించాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నాయని తెలిపారు.దీనికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాస్,పద్మ,యాదమ్మ,అనిత తదితరులు పాల్గొన్నారు.