సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలి
సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు ఈ నెల 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న నేపథ్యంలో,దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్ 15 నుంచి వాడవాడలా,ఇంటింటా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు నాయుడు పంపు ఆర్టీవో జంక్షన్,రామసురేందర్ నగర్లోని సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో సీఐటీయూ ఆటో డ్రైవర్స్ ఏరియా కార్యదర్శి అనిల్,వాణి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ..సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో కొనసాగుతాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆమె విమర్శించారు.పని గంటలు పెంచడం,కార్మికుల కష్టార్జితాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధానాలను సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు.లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను ఐక్యపరిచి,భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు రూపకల్పన చేయడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకొని,పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని కాసు మాధవి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా అనిల్ ఆధ్వర్యంలో అరటి పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్,జిల్లా అధ్యక్షులు ఎండి బషీర్,ఆఫీస్ బేరర్స్ సింగారపు కృష్ణ,పులిమాటి శివ,చెవుల శ్రీనివాస్,ఎండి జుబేదా,ఎండి బేగం,ఎండి జాహిద్,చిమ్మని కుమార్,ఎండి సూరయ్య,ఎండి ఫర్జానా,ఎస్డీ కాజా పాషా,రాకేష్,రమేష్,ఎస్.కె.హైమద్,ఎస్.కె.యాకూబ్ పాషా,ఎస్.కె.ఇంతియాజ్,గోగుల సాగర్,చిమ్మని భరత్ తదితరులు పాల్గొన్నారు