వెల్లంపల్లి గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా
టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) సహకారంతో నిరంతరం పనిచేస్తానని వెల్లంపల్లి గ్రామ సర్పంచ్ కూర వెంకటరాజిరెడ్డి స్పష్టం చేశారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం, ఈ రోజు భూపాలపల్లి మంజూరునగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సర్పంచ్ కూర వెంకటరాజిరెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి ఎమ్మెల్యే జీఎస్సార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సమావేశంలో సర్పంచ్ కూర వెంకటరాజిరెడ్డి మాట్లాడుతూ, వెల్లంపల్లి గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించినందుకు గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ముఖ్యంగా అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం,సైడ్ కాలువల ఏర్పాట్లు, తాగునీటి సమస్యల పరిష్కారం, పారిశుధ్య నిర్వహణ మెరుగుదల వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ,గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ఐక్యంగా పనిచేస్తే గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.