ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఎల్దండి నరేష్ ఏకగ్రీవ ఎన్నికఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఎల్దండి నరేష్ ఏకగ్రీవ ఎన్నిక

రేగొండ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన ఎల్దండి నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గురువారం మండలంలోని బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మండలానికి చెందిన 23 గ్రామపంచాయితీల ఉపసర్పంచ్‌లు పాల్గొని ఈ ఎన్నికను నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్‌ల హక్కులు, సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించిన అనంతరం ఉపసర్పంచ్‌ల ఫోరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు.ఫోరం గౌరవ అధ్యక్షుడిగా చుక్క జనార్దన్,ఉపాధ్యక్షులుగా పెండెల శంకర్, ఆకుతోట తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా నీరటి రంజిత్, కార్యదర్శిగా గుర్రం రమేష్,కోశాధికారిగా గడల చిన్న సాంబయ్యలను ఎన్నుకున్నారు.అలాగే కార్యవర్గ సభ్యులుగా గుర్రం రాంబాబు, రాజేష్, బండి వెంకటేష్, సకినాల రవీందర్ లను నియమించారు.ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్దండి నరేష్ మాట్లాడుతూ, తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఉపసర్పంచ్‌లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశం ఉపసర్పంచ్‌ల మధ్య ఐక్యతను పెంపొందించడంలో కీలకంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *